తెదేపాలో చేరిన గిడ్డి ఈశ్వరి


వైకాపా తన ఆత్మాభిమానాన్ని దెబ్బ తీసిందని, అందుకే తెదేపాలో చేరుతున్నానని విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తెలిపారు. సోమ‌వారం ఉద‌యం పాడేరు నుంచి పలువురు స్థానిక ప్రజాప్రతినిధులతో కలసి ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి వచ్చారు. చంద్రబాబు ఆమెకు కండువా వేసి తెదేపాలోకి ఆహ్వానించారు. వైకాపాను వీడిన ఎమ్మెల్యేల సంఖ్య గిడ్డి ఈశ్వరితో 23కు చేరింది. ఈశ్వ‌రి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో డబ్బులుంటేనే టికెట్‌ అంటూ వైకాపా తనను దారుణంగా మోసం చేసిందని భావోద్వేగానికి గురయ్యారు. రాజకీయ భిక్ష పెట్టిన జగన్‌ను వీడటం బాధగా ఉందన్నారు. వైకాపా కార్పొరేట్‌ రాజకీయాల సంస్కృతిని తెచ్చి నమ్ముకుని ఉన్న తనలాంటివారిని అన్యాయం చేసిందని వాపోయారు. వైకాపా నేతలు ఆరోపిస్తున్నట్లుగా తాను రూ.25కోట్లకు అమ్ముడుపోయి ఉంటే తన పరిస్థితి ఇలా ఉండేది కాదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలకు సేవచేయాలనుకునే వారంతా కలిసిరావాలని పిలుపునిచ్చారు.

ముఖ్యాంశాలు