ముఖ్యాంశాలు

బురద జల్లండి.. అందులోనే కమలం పుడుతుంది : మోదీ


తనపై అనేకమంది జల్లుతున్న బురదకు బాధపడడంలేదని.. ఎందుకంటే అందమైన కమలం బురదలోనే వికసిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ గుజరాత్‌ పుత్రుడి ప్రజా జీవితంలో ఎలాంటి మచ్చ లేదు అని సోమవారం కచ్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ భుజ్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో స్పష్టం చేసారు. ఈ ఎన్నికలు అభివృద్ధికి, వారసత్వ రాజకీయాలకు మధ్య పోటీ అన్నారాయన. తాము అధికారం కోసం పనిచేయడం లేదని, 125 కోట్ల భారతీయుల కోసం పనిచేస్తున్నామని చెప్పారు. "నోట్లరద్దుపై కాంగ్రెస్‌ అసంతృప్తిగా ఉంది. అందుకే ఆరోపణలు చేస్తోంది. అయితే వారికి నేను చెప్పేది ఒక్కటే. సర్దార్‌ వల్లభాయ్‌ పుట్టిన నేలలోనే నేనూ పెరిగాను. పేద ప్రజల కలలను సాకారం చేస్తాను. దేశాన్ని దోచుకోడాన్ని ఎన్నటికీ అంగీకరించను" అన్నారు. భారత్‌పై నవంబర్‌ 26 ముంబయి దాడులు, ఆ తర్వాత యూరి దాడులు జరిగాయి. ఈ రెండు దాడుల్లో భారత్‌ ఎలా స్పందించిందో చూస్తే కాంగ్రెస్ కి బిజెపికి తేడా తెలుస్తుంది అని మోదీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి నీతి, నియతి లేదని, కనీసం నేత కూడా లేరని ప్రధాని దుయ్యబట్టారు. 70 రోజుల పాటు డోక్లాంలో మన సైనికులు చైనా సైనికులకు ఎదురొడ్డి ప్రాణాలకు తెగించి నిలబడితే.. అదే సమయంలో కాంగ్రెస్ వారు చైనా రాయబారిని కౌగిలించుకుంటారు.. అని మండిపడ్డారు. భుజ్‌తో పాటు పలు ప్రాంతాల్లో ప్రధాని ఇవాళ కొన్ని ఎన్నికల ప్రచార ర్యాలీల్లో పాల్గొంటున్నారు. 29న మరోమారు గుజరాత్ లో అయన ప్రచారం ఉంటుంది.

​సంబంధిత సమాచారం 
తాజా వార్తలు

EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

Ira News Paper

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us