భాజపా అభ్యర్థుల చివరి జాబితా విడుదల


గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు టిక్కెట్ల కేటాయింపు విషయంలో భాజపా అధిష్ఠానం ఐదుగురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు భాజపా షాకిచ్చింది. వీరిలో ఒక మంత్రి కూడా ఉన్నారు. భాజపా తన అభ్యర్థుల చివరి జాబితాను సోమవారం విడుదల చేసింది. మొత్తం 34 మంది అభ్యర్థులతో ఈ జాబితాను ప్రకటించింది. మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్‌ పటేల్‌కు కూడా టికెట్‌ కేటాయించలేదు. అయితే, ఆమె ఇది వరకే పోటీ చేయనని ప్రకటించారు. ప్రస్తుతం ప్రభుత్వంలో ఆనంద్‌ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి రోహిత్‌ పటేల్‌కు తుది జాబితాలో నిరాశే ఎదురైంది. 12 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్‌ కేటాయించారు.

ముఖ్యాంశాలు