డిప్యుటేషన్‌ భత్యాన్ని రెండింతలు పెంచిన కేంద్రం


కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు డిప్యుటేషన్‌ భత్యాన్ని రెండింతలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రూ.2వేలుగా ఉన్న ఈ భత్యాన్ని గరిష్ఠంగా రూ.4,500లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. 7వ పే కమిషన్‌ సిఫారుసుల మేరకు ఈ భత్యాన్ని పెంచారు. ఇకపై ప్రస్తుతం ఉన్న ప్రాంతంలోనే మరోచోటుకి డిప్యుటేషన్‌పై వెళితే మూలవేతనంపై 5 శాతం లేదా గరిష్ఠంగా రూ.4,500 చెల్లిస్తారు. వేరే ప్రాంతానికి డిప్యుటేషన్‌పై వెళ్తే మూలవేతనంపై 10 శాతం లేదా గరిష్ఠంగా రూ.9వేలు చెల్లిస్తారు. ప్రస్తుతం శాతాలు ఇవే అయినప్పటికీ గరిష్ఠంగా చెల్లించే మొత్తాలు రూ.2వేలు, రూ.4వేలు మాత్రమే.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం 

EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

Ira News Paper

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us