డ్రైవర్ సాహసంతో ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదంఅనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం మామిళ్లకుంట క్రాస్‌ వద్ద ఓ ఆర్టీసీ బస్సుకు మంగళవారం పెద్ద ప్రమాదం తప్పి యాభై మంది ప్రయాణికులు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. గోరంట్ల-పుట్టపర్తి మార్గంలో ద్విచక్రవాహనదారుడు ధర్మవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ను ఢీకొనబోయాడు. దీంతో బస్సు డ్రైవర్‌ ఇక్కసారిగా స్టీరింగ్‌ను పక్కకు తిప్పాడు. బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన వెళ్తున్న పాదచారులను ఢీకొని సమీపంలోని బావి వద్దకు దూసుకెళ్లింది. బస్సు 30 అడుగుల లోతున్న బావిలోకి ఒరిగినప్పటికీ డ్రైవర్‌ బ్రేకులు గట్టిగా వేసి ఆపగలిగాడు. బస్సులో 50 మంది ప్రయాణికులున్నారు. డ్రైవర్‌ అరగంట వరకు అలాగే బస్సును బ్రేకు తొక్కిపెట్టి నియంత్రించిన తర్వాత పోలీసులు, స్థానికులు ప్రయాణికులను నెమ్మదిగా కిందకి దించారు. ఈ ప్రమాదంలో ఓ పాదచారుడు మృతి చెందాడు. బస్సులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బస్సు డ్రైవర్‌ సమయస్ఫూర్తిని, తెగువను అందరూ ప్రశంసించారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం