నా బాల్యం కావాలని కోరుకుంటా - ఉప రాష్ట్రపతి


దేవుడు ఏమైనా వరం కోరుకోమంటే నా బాల్యం తిరిగివ్వాలని కోరుకుంటానని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఈరోజు ఆయన అమరావతిలో విట్‌ కళాశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని కల నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. రాజధానికి వసతులు, వనరులు కల్పించడంలో తీవ్ర కృషి జరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుచూపుతో అమరావతి విజ్ఞాన కేంద్రంగా రూపుదిద్దుకుంటోందన్నారు. విద్య, నాలెడ్జ్‌, ఆరోగ్య హబ్‌గా అమరావతిని మార్చాలన్న సీఎం కృషి ఎనలేనిదన్నారు. తెలివి అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుందని, దాన్ని గుర్తించి సానబెడితేనే మట్టి మాణిక్యాలు వెలికితీయొచ్చని వెంకయ్యనాయుడు అన్నారు. సాధారణ కుటుంబంలో జన్మించినా అసాధారణ స్థాయికి చేరుకునే అవకాశాలు ఉండటమే ఈ దేశం గొప్పదనమని పేర్కొన్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం