పెట్టుబడుల కోసం దక్షిణ కొరియా పయనం


ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిసెంబర్‌ 3న దక్షిణకొరియా పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో అయన అక్కడికి వెళుతున్నారు. ఈ పర్యటన మూడురోజుల పాటు జరగనుందని అధికారులు తెలిపారు. ఏపీలో కొరియా పారిశ్రామిక క్లస్టర్‌ ఏర్పాటుకు సంబంధించి ఈ పర్యటనలో కీలక ఒప్పందాలు జరగనున్నట్లు సమాచారం. ఇంతకు ముందే కొరియా బృందం అనంతపురం జిల్లాలో కొరియన్ సిటీ నిర్మాణానికి సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్న విషయం తెలిసిందే.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం