ప్రిన్స్ హ్యారీ, నటి మేఘన్ ల పెళ్లి కుదిరింది


బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ 2 మనవడు, రాకుమారుడు హ్యారీకి అమెరికాకు చెందిన ప్రముఖ నటి మేఘన్‌ తో పెళ్లి నిశ్చయమైంది. కెన్సింగ్టన్‌ ప్యాలెస్‌ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. 2016 నుంచి హ్యారీ, మేఘన్ ప్రేమలో ఉన్నారు. నవంబర్‌ తొలి వారంలో ప్రిన్స్‌ హ్యారీ, మేఘన్‌ల నిశ్చితార్థం జరిగినట్లుప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ అధికారిక భవనం క్లారెన్స్‌ హౌస్‌ వెల్లడించింది. 2018లో వీరి వివాహం జరగనుంది. పెళ్లి తర్వాత హ్యారీ దంపతులు కెన్సింగ్టన్‌ ప్యాలెస్‌లోని నాటింగ్‌హమ్‌ కాటేజ్‌లో ఉంటారని ఛార్లెస్‌ కార్యాలయం తెలిపింది.