భన్సాలీ కి ఎదురు దెబ్బలు

దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన పద్మావతి సినిమా విడుదలపై స్టే కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేయడంతో ఆనందపడిన చిత్ర యూనిట్‌కు బీహార్ రాష్ట్రప్రభుత్వ రూపంలో ఒక ఎదురుదెబ్బ తగిలింది. పద్మావతి ప్రదర్శనను బిహార్‌ రాష్ట్రం నిషేధించింది. పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్‌, గుజరాత్‌ రాష్ట్రాలు ఇదివరకే పద్మావతి చిత్రాన్ని నిషేధించాయి. తాజాయా ఈ చిత్రాన్ని బిహార్‌లోనూ ప్రదర్శించొద్దని సీఎం నితీశ్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు.

Facebook