EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us
Ira News Paper

మళ్లీ రెచ్చిపోయిన ఫరూక్ అబ్దుల్లా

నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత, జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా మరోసారి రెచ్చిపోయి తన పాకిస్థాన్ ప్రేమని చాటుకున్నారు. కేంద్రానికి దమ్ముంటే పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోనే కాదు, శ్రీనగర్‌ నడిబొడ్డున ఉన్న లాల్‌చౌక్‌లో తివ్రర్ణ పతాకాన్ని ఎగరవేయాలని ఆయన సవాల్ చేసారు. పీవోకే ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగం కాదంటూ గతంలో వ్యాఖ్యానించిన ఫరూక్ దానికి కొనసాగింపుగా ఈ దుర్మార్గ వ్యాఖ్యలు చేశారు. కేంద్రం, భాజపా పీవోకేలో జెండా ఎగరవేస్తామని మాట్లాడుతున్నారు. ముందు శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయమనండి. ఆ తర్వాత పీవోకే గురించి మాట్లాడుదురుగానీ’ అంటూ రెచ్చిపోయారు. పాక్‌ భారత్‌లో ఎప్పటికీ అంతర్భాగం కాదు, జమ్ముకశ్మీర్‌ పాకిస్థాన్ ది అని పునరుద్ఘాటించారు. ఫరూక్‌ చేసిన తాజా వ్యాఖ్యలపై భాజపా నేత, డిప్యూటీ సీఎం నిర్మల్‌సింగ్‌ మాట్లాడుతూ వేర్పాటు వాదులను, ఉగ్రవాదులను ఫరూక్‌ ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. లాల్‌చౌక్‌ సహా రాష్ట్రం నలుమూలలా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తున్న సంగతిని ఆయన మరిచిపోయినట్లు ఉన్నారని చురకలు వేశారు.

Facebook