మిస్ యూనివర్స్ డెమి లీగ్


దక్షిణాఫ్రికాకు చెందిన డెమి లీగ్‌ నీల్‌ పీటర్స్‌(22) 2017 విశ్వసుందరిగా ఎంపికైంది. లాస్‌వెగాస్‌లో జరిగిన అందాల పోటీల్లో పాల్గొన్న 92 మంది లో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. కొలంబియాకు చెందిన లారా గొంజాలెజ్‌, జమైకాకు చెందిన డెవీనా బెన్నెట్‌ మొదటి, రెండో రన్నరప్‌లుగా నిలిచారు. భారత దేశానికి చెందిన శ్రద్ధా శశిధర్‌ కి టాప్‌-16లో కూడా చోటు దొరకలేదు. విజేతగా నిలబెట్టింది. వెనెజువెలా, థాయిలాండ్‌కు చెందిన అతివలు నాలుగైదు స్థానాల్లో నిలిచారు. కాగా ఆఫ్రికా ఖండానికి ఈ కిరీటం దక్కడం నలభై ఏళ్ల తర్వాత ఇదే.

ముఖ్యాంశాలు