అంచనాకి మించి మెట్రో ప్రయాణం


అధికారుల అంచనాలను మించి తొలిరోజు ఏకంగా 2లక్షలకంటే ఎక్కువమంది మెట్రోలో ప్రయాణించారు. దేశంలో ఇప్పటివరకు వివిధ నగరాల్లో ప్రారంభమైన మెట్రోలో తొలిరోజు ఎక్కడా 50వేల మందికి మించి ప్రయాణించలేదు. హైదరాబాద్ లో దుర్భరమా ఉన్న రవాణా సదుపాయాల పరిస్థితి, ఇక్కడికక్కడ జామ్ లు, విపరీతమైన జాప్యం నేపథ్యం లో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గం కోసం ఎంత ఎదురుచూస్తున్నారో ఇది చూస్తే అర్థం అవుతున్నది. కాగా మెట్రో లో తొలిరోజే 2లక్షల మంది ప్రయాణించడం పట్ల మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. స్టేషన్లలో రద్దీని నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని మెట్రో అధికారులు, ఎల్‌ అండ్‌ టీ ప్రతినిధులకు సూచించారు.

ముఖ్యాంశాలు