ఆ సినిమాల్లో నేను లేనండీ బాబూ!


ఎనర్జీ ఉన్న యంగ్ హీరో సాయిధరమ్ తేజ్. ప్రతి చిత్రం ప్రత్యేకంగా ఉండాలనే తపనతో కష్టపడే తత్వం ఆయనది. కొన్ని సినిమాల విషయంలో తాను కేంద్రబిందువుగా జరుగుతున్న ప్రచారాల్ని పురస్కరించుకుని ఓ క్లారిటీ ఇచ్చారు. మహేశ్‌బాబు సినిమాలో తాను నటిస్తున్నానని, రామ్‌చరణ్‌-ఎన్టీఆర్‌ సినిమాలో కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నానని, అలాగే ‘గ్యాంగ్‌లీడర్‌’ సినిమా తనతో రీమేక్‌ చేస్తున్నారని.. ఇలా అనేక వార్తలు వస్తున్నాయి. అయితే వీటిలో ఏవీ నిజం కాదు అని చెప్పేసారు. అయితే తనకి మల్టీస్టారర్‌ సినిమాలో నటించాలని కోరిక అయితే ఉందని, మంచి కథ దొరికితే ఏ హీరోతోనైనా సరే నటించడానికి సిద్ధమని అన్నారు. వి.వి వినాయక్‌ దర్శకత్వంలో ఓ ఫాస్ట్ మూవీ, కరుణాకరన్‌ దర్శకత్వంలో ఒక యూత్ ఫుల్ లవ్ స్టోరీ చేస్తున్నానని, మరో మూడు సినిమాలు కూడా చేతిలో ఉన్నాయని చెప్పుకొచ్చారు సాయిధరమ్ తేజ్.

ముఖ్యాంశాలు