ఏకాకిగా మారుతున్న ఉత్తర కొరియా


ప్రపంచానికి ముప్పుగా మారిన ఉత్తర కొరియాపై ఒత్తిడి చేసేందుకు భారత్‌ సాయం చేయాలని అమెరికా విజ్ఞప్తి చేసింది. ఆ దేశం ఖండాంతర అణు క్షిపణుల ప్రయోగాలు చేపట్టకుండా అడ్డుకట్ట వేసేందుకు మిత్రదేశాలన్నీ ముందుకు రావాలని కోరింది. ఉత్తర కొరియా బుధవారం హ్వాసంగ్‌-15 ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. ఇది వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించి జపాన్‌ సముద్ర జలాల్లో పడినట్టు తెలుస్తోంది. ఇది అమెరికాలోని ఏ భూభాగాన్ని అయినా తాకగలదని భావిస్తున్నారు. దీంతో మండిపడిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధం వస్తే ఉత్తరకొరియాను భస్మీపటలం చేస్తామని హెచ్చరించారు. ఉత్తర కొరియా పై ఒత్తిడి పెంచేందుకు భారత్‌ సహా మిత్రదేశాల సహాయాన్ని అమెరికా అర్థించింది. ఉత్తర కొరియాతో ప్రత్యేక ఆర్ధిక అనుబంధం ఉన్న చైనా, రష్యా ఈ సమయంలో క్రియాశీలకంగా వ్యవహరించాలని అమెరికా ఆశిస్తున్నది. ఇప్పటికే 20 పైగా దేశాలు ఉత్తర కొరియాపై ఒత్తిడి ని తీవ్రతరం చేశాయని సమాచారం. కొన్ని దేశాలు ఉత్తర కొరియా నుంచి దౌత్యవేత్తలు, అధికారులను వెనక్కి రప్పిస్తున్నాయి.

ముఖ్యాంశాలు