కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు

కాపు రిజర్వేషన్ల పై ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం మంజునాథ కమిషన్‌ నివేదిక ఆధారంగా కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు 5శాతం రిజర్వేషన్లు కల్పించాలని, అసెంబ్లీలో కాపు రిజర్వేషన్లపై తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని నిర్ణయించింది. రేపు ఉదయం మరోసారి సమావేశమై రిజర్వేషన్ల అంశంపై ఎలా ముందుకెళ్లాలనే విషయమై చర్చిస్తారు. బీసీ కమిషన్‌ నివేదిక ఆధారంగా కాపులకు 5శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్తగా బీసీ-ఎఫ్‌ కేటగిరి కింద కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. కాపులకు ఇది నిజమైన పండుగ రోజు అన్నారు. కాపులకు 5శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ఏపీ మంత్రివర్గ నిర్ణయాన్ని బీసీలంతా వ్యతిరేకించాలని, పెద్దఎత్తున ఉద్యమించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య పిలుపునిచ్చారు.

Facebook