నెటిజెన్లు ఎక్కువ వెదికింది మోదీ కోసం!


ప్రముఖ సెర్చింజన్‌ యాహూ 2017లో నెటిజన్లు ఏ విషయాలపై ఆసక్తి చూపించారనే విషయమై నివేదికను విడుదల చేసింది. ఈ ఏడాది ‘యాహూ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌’గా భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా నిలిచారు. భారత్‌లో ప్రధాని మోదీ గురించి అత్యధికులు శోధించినట్లు ఆ నివేదిక తెలిపింది. 2017లో మోస్ట్‌ సెర్చ్‌డ్‌ పర్సనాలిటీగా మోదీ నిలిచారు. బాలీవుడ్‌ నటుడు వినోద్‌ ఖన్నా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి మోదీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. డేరాబాబా దత్త పుత్రిక హనీప్రీత్‌ సింగ్‌ పేరు కూడా ఈ జాబితాలో ఉంది. యాహూ ఇండియా ‘మోస్ట్‌ సెర్చ్‌డ్‌ ఫీమెల్‌ సెలబ్రటీ’గా సన్నీలియోని కొనసాగింది. న్యూస్‌మేకర్స్‌ జాబితాలో కొత్తగా ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, నిర్మలాసీతారామన్‌ పేర్లు చేరాయి. ఈ ఏడాది ప్రముఖ రాజకీయ నేతలుగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, రాహుల్‌గాంధీ, అమిత్‌షా, సుష్మాస్వరాజ్‌ నిలిచారు. అలాగే ఈ ఏడాది నెటిజన్లు ఎక్కువగా ఆధార్‌ గురించి తెలుసుకున్నారు. టాప్‌ బిజినెస్‌ స్టోరీ జాబితాలో జీఎస్టీ, వరల్డ్‌ బ్యాంక్‌ ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకింగ్‌, మూడీ ఇన్వెస్టర్‌ సర్వీస్‌ నిలిచాయి. ఈ ఏడాది బెస్ట్‌ డ్రెస్‌(మేల్‌)గా షాహిద్‌ కపూర్‌, బెస్ట్‌ డ్రెస్‌ ఫీమెల్‌గా ప్రియాంక చోప్రా నిలిచారు. మోస్ట్‌ స్టైలిష్‌ ఇండియన్స్‌ జాబితాలో మిథాలీ రాజ్‌, జాన్వీ కపూర్‌, అతియా శెట్టీ, మిరా రాజ్‌పుత్‌ ఈ ఏడాది కొత్తగా చేరారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం