భారత ప్రభుత్వంపై నిస్సాన్ దావా


తమ కంపెనీకి ప్రోత్సాహకాల బకాయిలు చెల్లించలేదని ఆరోపిస్తూ జపాన్‌కు చెందిన ఆటోమొబైల్‌ సంస్థ నిస్సాన్‌ మోటార్స్‌ భారత్‌పై రూ. 5వేల కోట్లకు దావా వేసిందని తెలిసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి గత ఏడాది ఈమేరకు లీగల్‌ నోటీసులు అందాయని అంటున్నారు. దీనిపై విచారణ కోరుతూ ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ను నిస్సాన్‌ కోరింది. 2008లో నిస్సాన్‌ తమిళనాడులో కార్ల తయారీ ప్లాంట్‌ను ప్రారంభించింది. ఆ సమయంలో పన్ను రీఫండ్‌తో సహా పలు ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పిన తమిళనాడు ప్రభుత్వం వాటిని ఉల్లంఘించిందని, తమకు ఆ బకాయిలు చెల్లించాలని కంపెనీ కోరింది. 2015లో కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లు పేర్కొంది. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో తాము ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించినట్లు పేర్కొంది.

ముఖ్యాంశాలు