యుపి స్థానిక ఎన్నికల్లో భాజపా విక్టరీ


ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తన మొదటి సవాల్ లో ఘన విజయం సాధించారు. యూపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపా భారీ విజయం దిశగా సాగుతోంది. యూపీలో ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. శుక్రవారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతున్నది. 652 పురపాలక స్థానాలు, 16 మేయర్‌, 198 నగరపాలిక పరిషత్‌లు, 438 నగర పంచాయతీలు ఎన్నికలు జరిగిన వాటిలో ఉన్నాయి. 16 మేయర్‌ సీట్లలో 14 స్థానాల్లో ఇంతవరకూ భాజపా విజయం సాధించింది. వారణాసి, అయోధ్య, లఖ్‌నవూ సహా గోరఖ్‌పూర్‌, ఘజియాబాద్‌, బరేలీ, ఆగ్రా, ఫిరోజ్‌బాద్‌, మథుర, కాన్పూర్‌, సహరాన్‌పూర్‌, అలహాబాద్‌, మోరాబాద్‌, ఝాన్సీల్లో భాజపా గెలిచింది. మేరట్‌, అలీగఢ్‌లో బహుజన్‌ సమాజ్‌ పార్టీ విజయం సాధించింది. ఈ ఫలితాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశంలో మరోసారి అభివృద్ధే విజయం సాధించిందని మోదీ అన్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం