సన్నిధానంలో ఓక్కి బీభత్సం


కేరళలో ఓక్కి తుపాను బీభత్సం సృష్టిస్తున్నది. అయ్యప్పస్వామి దర్శనార్థం శబరిమల వెళ్లిన వేలాదిమంది భక్తులు ఓక్కి తుపానుకి చిక్కి విలవిల్లాడుతున్నారు. తుపాను తీవ్ర ప్రభావం దృష్ట్యా భక్తులను అడవి మార్గంలో వెళ్లవద్దని ట్రావెన్‌కోర్‌ బోర్డు కోరింది. ఎరుమేలి-పంబా, సథరం-పులిమేడు మార్గాలు ప్రమాదకరంగా మారాయి. సన్నిధానం చుట్టూ ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో పెనుగాలులు వీస్తున్నాయని, భారీ వర్షం కూడా కురుస్తోందని అధికారులు తెలిపారు. పంబానది ఉధృతంగా ప్రవహిస్తోందని.. భక్తులెవరూ నదిలోకి దిగి స్నానాలు చేయవద్దని అధికారులు ఆదేశించారు. ఎరుమేలి-కరిమల-సన్నిధానం మార్గం సైతం అత్యంత ప్రమాదకరంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ మార్గంలో పెద్దపెద్ద వృక్షాలు కూలిపోయాయని తెలిపారు. పంబ దగ్గర త్రివేణి పార్కింగ్‌ ఏరియా వరద నీటిలో మునిగిపోయింది. దీంతో ప్రస్తుతం శబరిమలకు రాకపోకలను అధికారులు నిలిపివేశారు. తుపాను దృష్ట్యా ఎరేమేలి-పంబా నడకదారిని నిషేధించారు. సన్నిధానం, పంబల్లో ప్రభుత్వం ప్రత్యేక షెల్టర్లను ఏర్పాటు చేసింది.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం