అణు పరీక్ష సక్సెస్ పై ఉత్తర కొరియా సంబరాలు


ఉత్తరకొరియా యుద్ధోన్మాదంతో రెచ్చిపోతోంది. ఎంత దారుణంగా ఆ దేశం పరిస్థితి ఉందంటే తాజాగా శక్తిమంతమైన ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో సంబరాలు చేసుకుంటున్నది. ప్రజలు నృత్యాలు చేస్తూ, బాణసంచా కాలుస్తూ వేడుకలు చేసుకుంటున్న దృశ్యాలను ఉత్తరకొరియా అధికార మీడియా శనివారం వెలుగులోకి తెచ్చింది. ఈ వేడుకలు రాజధాని ప్యాంగ్యాంగ్ లోని కిమ్ ఈ సంగ్ స్క్వేర్ వద్ద జరిగాయని పేర్కొంది. వేల సంఖ్యలో సైనికులు కూడా ఇందులో పాల్గొన్నారు. అధికార పార్టీ నిర్ణయాత్మక కమిటీ వైస్ ఛైర్మన్ పాక్ క్వాంగ్ హో నేతృత్వంలో ఈ సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా క్వాంగ్ హో మాట్లాడుతూ ఉత్తర కొరియా అణుశక్తిని చూసి అమెరికా వణికిపోతున్నదని అన్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం 

EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

Ira News Paper

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us