ఇన్ఫోసిస్ కొత్త సీఈఓ సలీల్ పరేఖ్


ఇన్ఫోసిస్‌ కొత్త సీఈవో పేరును ప్రకటించింది. క్యాప్‌జెమినీ ఎగ్జిక్యూటివ్‌ సలీల్‌ పరేఖ్‌ను తమ సంస్థ సీఈవోగా నియమించినట్లు ఇన్ఫోసిస్ శనివారం ప్రకటించింది. పరేఖ్‌ క్యాప్‌జెమినీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటన వచ్చిన ఎనిమిది గంటల్లోపే ఇన్ఫోసిస్‌ నియామక ప్రకటన వెలువడింది. 2018, జనవరి 1 వరకు పరేఖ్‌ క్యాప్‌జెమినీలో కొనసాగి, ఆ తర్వాత జనవరి 2న ఇన్ఫోసిస్‌ సీఈవోగా బాధ్యతలు చేపడతారు. పరేఖ్‌ బాంబే ఐఐటీ నుంచి ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ చదివారు. కార్నెల్‌ యూనివర్శిటీలో మాస్టర్స్‌ చేశారు.

ముఖ్యాంశాలు