కాపు రిజర్వేషన్ కి శాసనసభ ఆమోదం


కాపుల రిజర్వేషన్‌ బిల్లుకు ఏపీ శాసనసభ శనివారం ఆమోదం తెలిపింది. ఉదయం సభ ప్రారంభం కాగానే బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు పలువురు నేతలు ఈ బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడారు. కాపులకు బీసీ ఎఫ్‌ కేటగిరీగా 5 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ ఈ బిల్లును తీసుకువచ్చారు. అనంతరం వాల్మీకీ బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ కూడా సభలో తీర్మానం చేశారు.

ముఖ్యాంశాలు