ప్రధాని విదేశీ పర్యటనలతో పలు ప్రయోజనాలు

ప్రధాని నరేంద్ర మోదీ విస్తారంగా జరిపిన విదేశీపర్యటనలు దేశానికి పలు కీలక ప్రయోజనాలు చేకూర్చాయి. అనేకమందికి ప్రధాని మాటిమాటికి విదేశీపర్యటనలు ఎందుకు చేస్తున్నారు? దాని వల్ల దేశానికి ఒరిగింది ఏమిటి? అన్న ప్రశ్న తలెత్తడం సహజం. దేశంలోని ప్రధాన మీడియా ఈ విషయాలను ప్రజల ముందు ఉంచడం లేదు. ఉద్దేశపూర్వకంగా మీడియా ఈ విషయాలను ప్రజలనుంచి దాస్తోంది. ప్రధాని విదేశీపర్యటనల వల్ల ఇంతవరకూ కలిగిన కొన్ని లాభాలు చూడండి.
1.సౌదీఅరేబియా మనకు ఇంతవరకూ క్రూడ్ ఆయిల్ దిగుమతులపై " On time delivery premium charges" వేస్తూ వచ్చింది. సమయానికి వస్తువు అందించినందుకు అధిక రుసుము వసూలు చేస్తూ వచ్చేది. మన పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మరియు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ లు ఈ రుసుము రద్దు చేయిన్చగలిగారు, తద్వారా దేశానికి కొన్ని వేల కోట్ల ఆదాయం మిగిలింది. 
2. భూటాన్ లో మన దేశం 4 హైడ్రోఎలక్ట్రిక్ విద్యుత్కేంద్రాలు మరియూ ఆనకట్టలు నిర్మించదానికి కాంట్రాక్ట్ పొందింది.భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీ ( ప్రాకృతిక వనరుల ద్వారా వచ్చే ఎనర్జీ) లో సింహ భాగం మనకు అందుబాటులో ఉంటుంది. Green Energy వివరాలకు ఈ లింక్ చూడండి https://www.mnn.com/earth-matters/energy/stories/what-is-green-energy
3.నేపాల్ లో భారత్ అతి పెద్ద ఆనకట్ట నిర్మించబోతోంది. చైనా ఈ కాంట్రాక్ట్ పొందటానికి విశ్వప్రయత్నం చేసింది. కాని మన దేశం ఇది సాధించుకుంది. భవిష్యత్తులో 83% గ్రీన్ ఎనర్జీ దీనివల్ల మనం ఉచితంగా పొందే వీలు ఉంది.
4.జపాన్ తో సంబంధాలు ఎంతో మెరుగు పడ్డాయి. ఆ దేశం DMIC [ Delhi Mumbai Investment Corridor] లో 30 బిలియన్ డాలర్లు పెట్టుబడి కి సిద్ధమయింది.
5. వియత్నాం తో వ్యూహాత్మకంగా భారత్ సంబంధాలు మెరుగు పరచుకుంది. దక్షిణచైనా సముద్రంలో చమురు అన్వేషణకు ఆ దేశం మనకు కాంట్రాక్ట్ ఇచ్చింది. UPA ప్రభుత్వం ఇన్నాళ్ళు చైనా కు తొత్తుగా వ్యవహరిస్తూ ఈదిశగా అసలు ఏ అడుగూ వేయలేదు. మోడిి చైనా