ఓయూ హాస్టల్లో విద్యార్థి ఆత్మహత్య


సిద్ధిపేట జిల్లాకు చెందిన ఎంఎస్సీ ఫస్టియర్ స్టూడెంట్ మురళి ఉస్మానియా వర్సీటీ మానేరు హాస్టల్‌ రూమ్‌నెంబరు 159లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రావటం లేదని తీవ్ర ఒత్తిడికి లోనై అతడు బలవన్మరణం చెందాడని అంటున్నారు. అయితే మురళి రాసిన సూసైడ్ లేఖ లభించింది. 'ఈ టెన్షన్ నా వల్ల కాదు, ఐ యామ్ సారీ, గుడ్ బై ఎవ్రీ వన్. ఐ వాంట్ టు టేక్ రెస్ట్ ఇన్ పీస్. ఐ యామ్ రియల్లీ హ్యాపీ విత్ మై డెత్, ఐ యామ్ సారీ అమ్మ, గుడ్ బై' అంటూ ఆ విద్యార్థి లేఖలో రాశాడు. సూసైడ్ లెటర్ లభ్యం కావడంతో ఈ కోణంలో పోలీసులు విచారణ చేపట్టే అవకాశాలున్నాయి. విద్యార్థి ఆత్మహత్యకు తెలంగాణ ప్రభుత్వమే బాధ్యత వహించాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. పోలీసులను హాస్టల్ వద్ద విద్యార్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు యత్నించగా విద్యార్థులు అడ్డుకున్నారు. ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, వాస్తవాలు బటయపడతాయని ఓయూ వైస్ ఛాన్స్‌లర్ రాంచంద్రం అన్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం