కాలుష్యం క్రికెట్ మ్యాచ్ ని కాటేసింది


దేశ రాజధాని ఢిల్లీ లో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఈ కాలుష్యపు తీవ్రత ఇప్పుడు క్రికెట్‌పై కూడా ప్రభావం చూపిస్తోంది. భారత్‌-శ్రీలంక మూడో టెస్టు రెండో రోజు కాలుష్యం కారణంగా విపత్కర పరిస్థితి ఎదురైంది. గాలిలో నాణ్యత లేదంటూ శ్రీలంక ఆటగాళ్లు అంపైర్లను సంప్రదించారు. ఆటను నిలిపివేయాలని కోరారు. ప్రతిష్టంభనతో 20 నిమిషాల పాటు ఆట నిలిచిపోయింది. దిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత అందరికీ తెలిసిందే! ప్రాణవాయువు శాతం తగ్గడంతో రోజుల కొద్దీ అక్కడ పాఠశాలలు, కార్యాలయాలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది కూడా. భారత్‌-శ్రీలంక మధ్య మూడో టెస్టు ఢిల్లీ నగరంలోని ఫిరోజ్‌షా కోట్లాలో జరుగుతుండగా రెండో రోజు, ఆదివారం కాలుష్యం కారణమా ఆటకు అంతరాయం ఏర్పడింది. ఇన్నింగ్స్‌ 122.3వ బంతి విసిరిన తర్వాత బౌలర్‌ గమగె ఆయాసంతో ఆగిపోయాడు. ఫిజియో వచ్చిన తర్వాత ఆటగాళ్లు అంపైర్లను సంప్రదించి మ్యాచ్‌ నిలిపివేయాల్సిందిగా కోరారు. గాలిలో ఆమ్లజని శాతం తాగింది శ్రీలంకేయులు అంపైర్లకు తెలిపారు. అనంతరం వారు మాస్కులు ధరించారు. మ్యాచ్‌ రిఫరీ డేవిడ్‌ బూన్‌ దీనిపై వైద్యుని పిలిపించారు. కోహ్లీ, చండిమాల్‌ (కెప్టెన్లు) అంపైర్లు సుదీర్ఘంగా చర్చించారు. లంక కెప్టెన్ చండిమాల్‌ ఆట కొనసాగింపు పై అయిష్టత వ్యక్తం చేసాడు. మాస్క్‌లు ధరించి క్రికెట్‌ ఆడటం చరిత్రలో బహుశా మొదటి సారి.

ముఖ్యాంశాలు