ఖమ్మంలో ఐలయ్య అరెస్టు

ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్న గొర్రెల పెంపకందారుల మహాసభ కు ముఖ్య అతిథిగా హాజరు కాబోయిన వివాదాస్పద రచయిత, క్రైస్తవ నాయకుడు కంచె ఐలయ్యను పోలీసులు  అరెస్టు చేసి ఖమ్మం టూటౌన్‌ పీఎస్‌కు తరలించారు. ఈ మహాసభకు అనుమతి లేదంటూ  పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. కాగా  పోలీసుల తీరుపై ఐలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు అనుమతి లేదని తనను అరెస్టు చేయడం దారుణమని ఆయన అన్నారు. భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరితే అరెస్టు చేయిస్తారా ? అని ప్రశ్నించారు. 

Facebook
Twitter