ఖమ్మంలో ఐలయ్య అరెస్టు


ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్న గొర్రెల పెంపకందారుల మహాసభ కు ముఖ్య అతిథిగా హాజరు కాబోయిన వివాదాస్పద రచయిత, క్రైస్తవ నాయకుడు కంచె ఐలయ్యను పోలీసులు అరెస్టు చేసి ఖమ్మం టూటౌన్‌ పీఎస్‌కు తరలించారు. ఈ మహాసభకు అనుమతి లేదంటూ పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. కాగా పోలీసుల తీరుపై ఐలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు అనుమతి లేదని తనను అరెస్టు చేయడం దారుణమని ఆయన అన్నారు. భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరితే అరెస్టు చేయిస్తారా ? అని ప్రశ్నించారు.

ముఖ్యాంశాలు