పాకిస్థాన్ పై ట్రంప్ మండిపాటు

ఉగ్రవాదంపై పోరులో పాకిస్తాన్‌ సహకారం అందించడం లేదని అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. అఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదాన్ని విస్తరిస్తున్న హక్కానీ నెట్‌వర్క్‌పై పాకిస్తాన్‌ సైనిక చర్య చేపట్టడం లేదని ట్రంప్‌ ఆడ్మినిస్ట్రేషన్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌ వైఖరి, ఆ దేశపు తాజా చర్యలు ఉగ్రవాదానికి కొమ్ముకాస్తున్నట్లు ఉన్నాయని ట్రంప్‌ కార్యాలయం అభిప్రాయపడింది. ముంబై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ను పాకిస్తాన్‌ గృహనిర్భంధం నుంచి విడుదల చేయడం ఉగ్రవాదానికి ఊతం ఇవ్వడమేనని అమెరికా పేర్కొంది. హక్కానీ నెట్‌వర్క్‌ పాకిస్తాన్‌ కేంద్రంగానే  కార్యకలాపాలు నిర్వహిస్తోందని, అయినా సరే పాకిస్తాన్‌ చర్యలు తీసుకోవడం లేదని ట్రంప్‌ కార్యాలయం తెలిపింది. 

Facebook