రికార్డుల విరాట్


ప్రపంచ క్రికెట్లో రికార్డుల శిఖరం విరాట్‌ కోహ్లి డాన్‌ బ్రాడ్‌మాన్‌ పేరిట ఉన్న ఒక అరుదైన రికార్డును బ్రేక్‌ చేశాడు. శ్రీలంకతో మూడో టెస్టులో సాధించిన డబుల్‌ సెంచరీ ద్వారా ఫలితంగా అత్యంత తక్కువ సమయంలో(రోజులు) ఆరు డబుల్‌ సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. దాంతో తొలి ఆరు ద్విశతకాలు సాధించే క్రమంలో బ్రాడ్‌మాన్‌ రికార్డును విరాట్‌ అధిగమించాడు. తన కెరీర్‌లో విరాట్‌ ఆరు డబుల్‌ సెంచరీలను సాధించడానికి 499 రోజులు పడితే, డాన్ బ్రాడ్‌మ్యాన్‌కు 581 రోజులు పట్టింది. 2016, జూలైలో విండీస్‌పై తొలిసారి డబుల్‌ సెంచరీని కోహ్లి సాధించాడు. అదే ఏడాది మూడు డబుల్‌ సెంచరీలు చేసిన కోహ్లి 2017లో ఇప్పటివరకూ మూడు డబుల్‌ సెంచరీలు చేశాడు. వరుస ఇన్నింగ్స్‌ల్లో రెండు డబుల్ సెంచరీలు సాధించిన రెండో భారత క్రికెటర్‌గా కూడా కోహ్లి గుర్తింపు పొందాడు. అంతకుముందు వినోద్‌ కాంబ్లి మాత్రమే ఈ ఘనత సాధించాడు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం