రా.. రా.. రాహుల్ !!


కాంగ్రెస్‌ అధ్యక్ష పీఠం కోసం సోమవారం రాహుల్‌ గాంధీ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు మద్దతుగా తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్‌ నేతలు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఇందుకోసం కాంగ్రెస్ సీనియర్ నేతలు ఢిల్లీ బాట పట్టారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్‌ దాఖలు దాఖలు చేయడానికి గడువు ఉంది. షెడ్యుల్‌ ప్రకారం ఈ నెల 17న పోలింగ్, 19న కౌంటింగ్‌ జరగనుంది. అయితే ప్రత్యర్థి ఎవరూ లేకపోవడంతో షెడ్యుల్‌కు ముందే రేపే రాహుల్‌ను కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం ఉండడంతో అన్ని రాష్ట్రాలనుంచీ కాంగ్రెస్ నేతలు ఢీల్లీ బాట పట్టారు.

కాంగ్రెస్‌ చీఫ్‌గా రాహుల్‌ పగ్గాలు చేపట్టేందుకు సర్వం సిద్ధమైంది. అధ్యక్ష రేసులో ఎవరూ లేకపోవడంతో రాహుల్‌ ఎన్నిక ఏకగ్రీవమవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ చీఫ్‌గా రాహుల్‌ మినహా మరే నేత బరిలో దిగే అవకాశం లేకపోవడంతో ఆయన ఎన్నిక లాంఛనప్రాయమే. రాహుల్‌ తరపున పలు రాష్ట్రాల పార్టీ యూనిట్లు నామినేషన్లు దాఖలు చేస్తుండటంతో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో అధ్యక్ష ఎన్నికల కోలాహలం నెలకొంది.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం