లంక ఆటగాళ్లది డ్రామా : భరత్ అరుణ్


భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో శ్రీలంక ఆటగాళ్లు కాలుష్యం భరించలేము అంటూ మాస్క్‌లు ధరించడం ఒక డ్రామా అంటూ టీమిండియా బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ విమర్శించారు. ఒకే మైదానంలో రెండు జట్లు ఆడుతున్నప్పుడు వారిలో ఒక జట్టయిన టీమిండియా ప్లేయర్లు ఎందుకు మాస్కులు ధరించలేదని ప్రశ్నించారు. కాలుష్యంతో మైదానంలో గాలి పీల్చుకోలేకపోతున్నామని, మ్యాచ్‌ నిలిపివేయాలని పదేపదే లంక ఆటగాళ్లు అంపైర్లకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆట ముగిసిన అనంతరం భరత్‌ అరుణ్‌ మీడియాతో ముచ్చటించారు. భారత్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి రెండు రోజులుగా మాస్క్‌ లేకుండానే బ్యాటింగ్‌ చేశాడు... కానీ అదే మైదానంలో ఆడుతున్న లంక ప్లేయర్లు మాత్రమే మాస్కులు ధరించి మ్యాచ్‌ నిలిపేయాలని కోరడం ఏమిటని ప్రస్తావించారు. కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ షెడ్యూల్‌ ఖరారు చేయదన్నారు. ఆటపై దృష్టి మానేసి వేదికల వ్యవహారంతో ఆటగాళ్లకు సంబంధం ఏమిటన్నారు. భారీ స్కోరు దిశగా దూసుకుపోతున్న భారత్‌ను నిలువరించలేక లంక ఈ కాలుష్యం డ్రామాకు తెరలేపిందని క్రీడాభిమానులు భావిస్తున్నారు.

ముఖ్యాంశాలు