357 కిలోమీటర్లు నడిచిన జగన్


Jagan Pada yathra

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర లో భాగంగా ఇప్పటివరకూ మొత్తం 356.8 కిలోమీటర్లు నడిచారు. కడప జిల్లాలో ఇడుపుల పాయ నుంచి యాత్ర మొదలైంది. ఆదివారం కర్నూలు జిల్లాలో యాత్రకు విరామం ఇచ్చారు. ఇది యాత్రలో 25వ రోజు. ఆదివారం జగన్ మదనాంతపురం క్రాస్ నుంచి చెరువుతండా వరకు నేడు 10.6 కిలోమీటర్లు నడిచారని పార్టీ వర్గాలు తెలిపాయి. కర్నూలు జిల్లాలో 18 రోజుల యాత్ర సాగింది. 7 నియోజక వర్గాలు 14 మండలాల్లో 240 కిలోమీటర్ల మేర జగన్ పాదయాత్ర కొనసాగించారు. నవంబర్ 14న కర్నూలు జిల్లాలో ప్రవేశించిన జగన్ 18 రోజులపాటు నడిచి ఇవాళ్టితో (డిసెంబర్ 3) ఈ జిల్లాలో యాత్ర ముగించారు. సోమవారం నుంచి అనంతపురం జిల్లాలో కొనసాగనుంది. గుంతకల్ నియోజకవర్గంలోని గుత్తి మండలం బసేనపళ్లిలో ఉదయం 8:30 గంటలకు అనంతపురం జిల్లాలో జగన్ యాత్ర మొదలవుతుంది.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం