కాలుష్య కోట్లాలో మ్యాచ్.. మండిపడిన ట్రిబ్యునల్


భారత్‌-శ్రీలంక మధ్య మూడో టెస్టు మ్యాచ్‌కు ఢిల్లీలో కమ్ముకున్న కాలుష్యం అంతరాయం కలిగిస్తున్న నేపథ్యంలో జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ) మండిపడింది. కాలుష్యం ప్రమాదస్థాయికి చేరినా ఫిరోజ్‌ షా కోట్లా మైదానంలో మ్యాచ్‌ను ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించింది. దిల్లీలో వాయు కాలుష్యానికి సంబంధించిన కేసుపై విచారణ చేపట్టిన ట్రైబ్యునల్‌ ఆ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. "వాయు కాలుష్యం అధ్వాన పరిస్థితికి దిగ్గజారింది. చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురవుతు న్నారు. దిల్లీ ప్రభుత్వానికి ప్రస్తుత పరిస్థితి గురించి తెలుసు. కాలుష్యపు తీవ్రత పీఎం 2.5, పీఎం 10 స్థాయిల నుంచి ప్రమాదకర స్థాయికి చేరింది. దీని తర్వాతి స్థాయి ఇక ఎమర్జెన్సీ లెవల్‌. రాష్ట్ర కాలుష్య నియంత్రణ సంస్థ, దిల్లీ ప్రభుత్వం, కార్పొరేషన్లు గత నాలుగు రోజులుగా దీనిపై ఏమి చేస్తున్నాయో చెప్పాలి. దిల్లీ ప్రభుత్వం తన కార్యాచరణను బుధ‌వారం నాటికి వెల్లడించకపోతే భారీగా జరిమానాలు తప్పవు" అని ట్రైబ్యునల్‌ హెచ్చరించింది. కోట్లా మైదానంలో మ్యాచ్‌ను కొనసాగిస్తున్న నిర్వహకులపై కూడా ట్రైబ్యునల్‌ మండిపడిం ది. కాలుష్యం ప్రమాద స్థాయికి చేరినా మ్యాచ్‌ను ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించింది. కాలుష్యం కారణంగా ఇబ్బందిపడ్డ శ్రీలంక ఆటగాళ్లు రెండో రోజు మాస్క్‌లు ధరించి స్టేడియంలో ఫీల్డింగ్‌ చేశారు. మూడో రోజు కూడా ఆట కాలుష్యం మధ్యనే కొనసాగింది.

ముఖ్యాంశాలు