కాలుష్యం పడగ నీడలో ఢిల్లీ

భారత రాజధాని దిల్లీ ప్రాంతంలో కాలుష్యం తీవ్ర రూపం దాల్చి ప్రమాద స్థాయికి చేరింది. ఈ విషయాన్ని యూరోపియన్ స్సేస్ ఏజెన్సీ(ఈఎస్ఏ) కూడా తేటతెల్లం చేసింది. ఢిల్లీ ప్రాంతంలో కాలుష్యం తీవ్రత తెలిపే ఉపగ్రహ చిత్రాలను విడుదల చేసింది. నవంబర్ 10న దేశ రాజధాని ప్రాంతాన్ని కాలుష్య మేఘాలు కమ్ముకున్న రీతిని ఈ చిత్రాలు ప్రతిఫలించాయి. ఈఎస్ఏకు చెందిన సెంటినల్-5పీ ఉపగ్రహం ద్వారా ఈ చిత్రాలను తీశారు. భూగ్రహంపై వాతావరణ మార్పులను ఈ ఉపగ్రహం పరిశీలిస్తుందని ఈఎస్ఏ డైరెక్టర్ ఆఫ్ ఎర్త్ అజ్బర్వేషన్ జోసెఫ్ తెలిపారు. నవంబర్ 6 నుంచి 14 మధ్య గాలి మందగమనం, అధిక తేమ, పంటలను తగలబెట్టడం వంటి కారణాల వలన వాయు కాలుష్యం భీకర రూపు దాల్చింది. పవర్ ప్లాంట్ల నుంచి వస్తున్న కాలుష్య తీవ్రత వలన బిహార్‌లోని పట్నా, ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ ప్రాంతాల్లో పరిస్థితిని మరి కొన్ని చిత్రాల్లో చూపింది.