గుంటూరు లో షాపింగ్ మాల్ ప్రారంభించిన వెంకీ


గుంటూరు లోని లక్ష్మీపురంలో ఏర్పాటైన సీఎంఆర్ షాపింగ్ మాల్ ను విక్టరీ వెంకటేష్ ఆదివారం ప్రారంభించారు. మాల్ అధినేత మావూరి వెంకట రమణ, మహిళా కమిషన్ చైర్ పెర్సన్ నన్నపనేని రాజకుమారి. ఎమ్మెల్యే ఎం వేణుగోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వందల సంఖ్యలో అభిమానులు వెంకటేష్ కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ వచ్చే ఏడాది తనవి నాలుగు చిత్రాలు ఉంటాయని చెప్పారు. ఎపికి చిత్రపరిశ్రమ సరైన సమయంలో వస్తుందని అన్నారు. ఆదాయంలో సగం సామాజిక సేవకు ఉపయోగిస్తామని మావూరి వెంకటరమణ చెప్పారు.