నలభై నెలల్లో లక్షా ఇరవై వేల కోట్ల అప్పులు


దేశంలోనే తెలుగు రాష్ట్రాలు అప్పులు చేయడంలో చురుగ్గా ఉన్నాయనే అభిప్రాయంతో చేసిన పరిశీలనలో ఆశ్చర్యకరమైన విషయం వెలుగు చూసింది. రాష్ట్రం వయసు, చేసిన కాలం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, జనాభా ఇలాంటివన్నీ పరిగణనలోకి తీసుకుని చూస్తే ఆంధ్రప్రదేశ్ చేసిన అప్పులు అత్యధికం అని భావించాలి. తెలంగాణ విడిపోయే నాటికి ఆంధ్ర ప్రదేశ్ వాటాగా వచ్చిన వారసత్వ అప్పు 96 వేల కోట్లు. అయితే గత మూడేళ్ళ పైచిలుకు కాలంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసిన అప్పులు అక్షరాలా ఒక లక్షా ఇరవై వేల కోట్లు. మొత్తం కలిసి రాష్టంపై ఉన్న అప్పుల భారం 2.16 లక్షల కోట్ల పైమాటే. అంటే సుమారు ఏడున్నర కోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి తల పైనా సుమారు 30 వేల రూపాయల అప్పు భారం ఉందన్నమాట.