శశికపూర్‌ కన్నుమూత


ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, దర్శక నిర్మాత శశికపూర్‌ (79) కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కబీ కబీ, దుస్‌రా ఆద్మీ, జమీన్‌ ఆస్మాన్‌ వంటి పలు హిట్‌ చిత్రాలలో శశి కపూర్ నటించారు. అమితాబ్‌తో కలిసి శశికపూర్‌ దివార్‌, నమక్‌ హలాల్‌ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ప్రతిష్టాత్మక పద్మభూషణ్‌, దాదా సాహెబ్‌ ఫాల్కెతో పాటు ఎన్నో అవార్డులు శశికపూర్‌ ను వరించాయి. ఆగ్‌ చిత్రం ద్వారా ఆయన బాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. హీరోగా ఆయన తొలి చిత్రం ధర్మపుత్ర. ఆయన నటించిన చివరి చిత్రం సైడ్‌ స్ట్రీట్స్‌ (1999). పాతతరం హీరో, నిర్మాత పృథ్వీరాజ్‌ కపూర్‌ మూడో కుమారుడు శశికపూర్‌. ప్రఖ్యాత షో మాన్ రాజ్ కపూర్ సోదరుడు. శశికపూర్‌ మృతి పట్ల బాలీవుడ్‌ చిత్ర ప్రముఖులు, దర్శక, నిర్మాతలు ప్రగాఢ సంతాపం తెలిపారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం