ఆ సినిమాలో గ్రాఫిక్స్ ఉండవట !

ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ల మల్టీస్టారర్‌ చిత్రం ఇంకా కథ కూడా సిద్ధం కాకపోయినా ఇప్పుడో కొత్త సంచలనంగా మారింది. రాజమౌళి తన ట్విటర్‌ ఖాతాలో చరణ్‌, తారక్‌తో కలిసి దిగిన ఫొటో పోస్ట్‌ చేయడంతోనే ఈ చిత్రంపై భారీ అంచనాలు మొదలయ్యాయి. క్రీడా నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని, తారక్‌, చరణ్‌ ఇందులో బాక్సర్లుగా నటిస్తున్నారని తెలిసింది. అయితే ఈ సినిమా పూర్తి గ్రాఫిక్ ఫ్రీ అని, ఎలాంటి గ్రాఫిక్స్‌తో కూడిన సన్నివేశాలను తెరకెక్కించడంలేదని రాజమౌళి అంటున్నారట. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ఈ చిత్రానికి కథ సిద్ధం చేస్తున్నారు.

Facebook
Twitter