కాంగ్రెస్ చేస్తున్న తప్పేమిటి?


rahul gandhi

ప్రపంచ బ్యాంకు, మూడీస్ ర్యాంకుల విధానం సహేతుకంగా లేదని రాహుల్‌, ఆయన అనుచర గణం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ప్రపంచ బ్యాంకు అనుసరించిన ప్రమాణా లను వారు తప్పు పడుతున్నారు. భారత ఆర్థిక వ్యవస్థలో అంకురిస్తున్న గుణాత్మక వైవిధ్యాన్ని ప్రపంచబ్యాంకు ఇతర అంతర్జాతీయ ఆర్ధిక సంస్థలు చూడగలుతున్నాయి. అయితే రాహుల్‌ బృందానికి అవి కనిపించలేదు. ఇందుకు కారణాన్ని మనం సులభం గానే అర్థం చేసుకోగలం. దేశాన్ని ఇంతకాలమూ పేదరికంలోనే ఉంచిన ఈ అవకతవక ఆర్థిక వ్యవస్థకి, పారదర్శకత చొరలేని అవినీతికి పెద్ద పీట వేసి కాపాడుకుంటూ వస్తున్న కాంగ్రెస్ పార్టీకి వారసుడాయన! ప్రపంచ ప్రఖ్యాత ‘మూడీస్‌’ సంస్థ భారత్‌కు మెరుగైన రేటింగ్‌ ఇవ్వడంపైనా అనుమానాలు వ్యక్తం చేశారాయన. గుజరాత్‌ ఎన్నికల నేపథ్యంలో భాజపాకు మేలు చేయడంకోసం అమెరికన్‌ సంస్థలన్నీ కుమ్మక్కయ్యాయని కూడా కొందరు కాంగ్రెస్‌ మేధావులు ఆరోపిస్తున్నారు. గుజరాత్‌ ఎన్నికలకోసం అంతర్జాతీయ ఆర్థిక సంస్థలన్నీ ఈ రేటింగ్ లు ఇస్తాయా? ఇవే రేటింగ్ లు ప్రతికూలంగా వస్తే కాంగ్రెస్ ఈ మాట అనగలుగుగుతుందా? అసలు కాంగ్రెస్ ఆరోపణ ఎంత హాస్యాస్పదమనే విషయం వారికే తెలుసు. నిజంగా అంకెలు మార్చేసి మాయ చేయాలనుకునే ప్రభుత్వం అయితే మోదీ హయాంలో జిడిపి ఎందుకు తగ్గుతుంది? ఇంత సాహసోపేతంగా తమ రాజకీయ భవిష్యత్తుని కూడా పణంగా పెట్టి మోదీ సంస్కరణల్ని ఎందుకు అమలు చేస్తారు? అసలు రాహుల్ బృందం నేర్వవలసిన పాఠం ఒకటి ఉంది... ఏ వ్యక్తినైనా సరే అదే పనిగా విమర్శించడం వలన అతడిని బలహీనుడ్ని చేయగలం అనుకోవడం తప్పు. ప్రధాని మోదీ సర్కారుకి ఈ మూడున్నరేళ్లలో ఏనాడైనా, కనీసం ఒక్క నిమిషమైనా కాంగ్రెస్ పార్టీ లేదా ఇతర ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సహకారాన్ని అందించాయా? చివరికి పాకిస్థాన్ పై మెరుపుదాడుల సమయంలో, చైనాతో డోక్లామ్ వద్ద ప్రతిష్టంభన సమయంలో కూడా ఇవి వెన్నుపోటుకే ప్రయత్నించాయి కానీ ఇండియా ఫస్ట్ అనుకోలేదు కదా! అంతెందుకు నిత్యావసరాల ధరలను అదుపు చేయడంలో మోదీ సర్కారు విఫలం అవుతున్నా ప్రతిపక్షాలు మాట్లాడడం లేదు. కేవలం మోదీ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం తప్ప, నల్ల కుబేరులకు ఇబ్బంది కలిగించే ప్రతి చర్యనీ వ్యతిరేకించడం తప్ప.. ఏ ఒక్కనాడూ కూడా నిజమైన జనం ఇబ్బందులపై ప్రతిపక్షాలు పోరాడలేదు. అందుకే వీటి విమర్శలకు జనంలో విలువ లేకుండా పోతున్నది. ఇప్పటికైనా కాంగ్రెస్ అండ్ కో ముఖ్యంగా రాహుల్ భజన బృందం ఆ సత్యాన్ని గమనిస్తే... కనీసం వచ్చే ఎన్నికల నాటికైనా తప్పులు సరిదిద్దుకుంటే సరి అయిన ప్రచారాంశాలను గుర్తించగలుగుతారు.

ముఖ్యాంశాలు