గూగుల్ మ్యాప్స్ లో టూ వీలర్ ఫీచర్

గూగుల్ మ్యాప్స్ లో ఆ సంస్థ ఒక గొప్ప ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. భారత్‌ వినియోగదారుల కోసం గూగుల్ మ్యాప్స్ అప్లికేషన్‌కు ఈ కొత్త ఫీచర్‌ను లాంచ్‌ చేసారు. గూగుల్‌ మూడవ ఎడిషన్‌ లో  వాయిస్ నావిగేషన్‌తో దీన్ని  మంగళవారం విడుదల చేసింది. టూవీలర్‌  సెగ్మెంట్‌లో  ప్రపంచంలో భారత్‌ అతిపెద్ద మార్కెట్‌గా భావిస్తున్న గూగుల్‌  భారత్‌కోసం ప్రత్యేకంగా ఈ ఫీచర్‌ను తెచ్చిందని గూగుల్‌ మాప్స్‌  డైరెక‍్టర్‌ మార్తా వెల్ష్ తెలిపారు. టూ వీలర్ మోడ్ పేరిట ఈ ఫీచర్ విడుదలైంది. దీని సహాయంతో  ఇది సరైన మార్గాన్నిమ్యాప్ లో చూపిస్తుంది. మ్యాప్స్‌లో కారు, ఫుట్, ట్రెయిన్ తదితర విభాగాల పక్కనే ఇప్పుడు టూ వీలర్ ఆప్షన్‌ కూడా కనిపిస్తుంది. దీన్ని తెరిస్తే టూ వీలర్ నడిపే వారి కోసం ప్రత్యేకంగా గూగుల్ మ్యాప్ ఓపెన్ అవుతుంది.  షార్ట్‌కట్ రూట్లను కూడా ఈ టూ వీలర్ మోడ్‌లో యూజర్లు పొందవచ్చు. 

Facebook