ట్రంప్ పంతం నెగ్గింది


ఆరు ముస్లిం దేశాల నుంచి ప్రజలు అమెరికా రాకుండా నిషేధిస్తూ ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ట్యావెల్‌ బ్యాన్‌ను తీసుకొచ్చిన విషయం.. దానిపై ఫెడరల్ కోర్టులు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో ట్రంప్ ఆశయం పూర్తిగా నెరవేరలేదు. అయితే తాజాగా ఈ నిషేధం పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు అమెరికా సుప్రీంకోర్టు అంగీకరిస్తూ తీర్పు వెలువరించింది. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకే ట్రంప్‌ ఆరు ముస్లిం దేశాలపై ట్రావెల్‌ బ్యాన్‌ విధించారు. ఇరాన్‌, లిబియా, సిరియా, యెమన్‌, సోమాలియా, ఛాద్‌ దేశాలు వీటిలో ఉన్నాయి. ట్రంప్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయా న్యాయస్థానాలు ట్రావెల్‌ బ్యాన్‌పై కొన్ని ఆంక్షలు విధించాయి. ముస్లిం దేశాల ప్రయాణికులకు అమెరికాలో దగ్గరి సంబంధీకులు అంటే అమ్మ, నాన్న, కొడుకు, కుమార్తె తదితరులు శాశ్వత నివాసులుగా ఉన్నట్టయితే వారికి అనుమతినివ్వాలని కింది కోర్టులు పేర్కొన్నాయి. అయితే ఇపుడు సుప్రీంకోర్టు నిషేధంపై ఆయా కింది కోర్టులు విధించిన ఈ ఆంక్షలను ఎత్తివేసి, పూర్తిస్థాయిలో నిషేధాన్ని అమలు చేయాలని పేర్కొంది. అయితే ఇందులో న్యాయపరమైన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని తదుపరి కార్యాచరణ చేపట్టాలని సూచించింది.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం