భారీ ఎత్తున "అజ్ఞాతవాసి" విడుదల


పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అజ్ఞాతవాసి’ విడుదలలో కొత్త రికార్డులు సృష్టించనుంది. హారిక, హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ ఈ చిత్ర కథానాయికలు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ స్వరకర్త. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 10న విడుదల చేయనున్నారు. గతంలో జల్సా, అత్తారింటికి దారేది చిత్రాల ఘన విజయంతో పవన్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌కు మంచి క్రేజ్‌ ఏర్పడింది. ఈ దృష్ట్యా ఈ సినిమాను భారీఎత్తున విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. త్రివిక్రమ్‌ సినిమాలకు ఓవర్సీస్‌లో కూడా మంచి డిమాండ్‌ ఉంది. ఈ దృష్ట్యా అమెరికాలోని 209 ఏరియాల్లో ‘అజ్ఞాతవాసి’ని విడుదల చేయటానికి చిత్ర బృందం ఏర్పాట్లు చేసింది. ‘బాహుబలి2’ 126 చోట్ల, ఖైదీ నంబర్‌ 150ని 74 చోట్ల, కబాలిని 73 ఏరియాల్లో, ‘దంగల్‌’ ని 69 లొకేషన్లలో గతంలో విడుదల చేయగా ఇప్పుడు ఆ రికార్డులను ‘అజ్ఞాతవాసి’ బద్దలుకొట్టనుంది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం 

EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

Ira News Paper

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us