ముంబై కి ఓఖి భయం

ఓఖీ తుపాను దక్షిణ తమిళనాడు, దక్షిణ కేరళలో బీభత్సం సృష్టించిన అనంతరం మహారాష్ట్రను తాకింది. ముంబయి దిశగా ఇది పయనిస్తోంది. దీంతో ముంబయిలో మంగళవారం ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. ఇక్కడ భారీ వర్షాలకు అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అధికారులు నగరంలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. రైల్వే స్టేషన్ల వద్ద అదనపు భద్రతను ఏర్పాటుచేశారు.జాలర్లు సముద్రంలోకి వెళ్లరాదని ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. బుధవారం ఉదయం ఓఖీ తుపాను గుజరాత్‌ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఓఖీ తుపాను కన్యాకుమారి, దక్షిణ కేరళ, లక్షద్వీప్‌ ప్రాంతాలను వణికిఞ్చి అపార నష్టాన్ని కలుగజేసింది. భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులకు అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందల సంఖ్యలో చెట్లు కూలిపోయాయి. పలు చోట్ల  విద్యుత్‌, సమాచార వ్యవస్థ నిలిచిపోయింది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో 20 మంది బలయ్యారు. వందల సంఖ్యలో జాలర్లు సముద్రంలో చిక్కుకుపోగా భద్రతా సిబ్బంది సురక్షితంగా తీసుకొచ్చారు.


 

Facebook
Twitter