రామాలయ నిర్మాణం ఆగదు


సుప్రీంకోర్టు తీర్పు ప్రతికూలంగా వచ్చినా సరే రామజన్మభూమిలో ఆలయ నిర్మాణం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆగదని రామజన్మభూమి న్యాస్‌ చీఫ్‌ మహంత్‌ నృత్య గోపాల్‌ దాస్‌ స్పష్టం చేసారు. అయోధ్య వివాదంపై తీర్పు వాయిదా పడిన నేపథ్యంలో రామజన్మభూమి న్యాస్‌ మహంత్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహకారంతో, పార్లమెంట్‌ ద్వారా ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన అన్నారు. రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం ఉండగానే అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుగుతుందని చెప్పారు. మెజారిటీ ప్రజలు అయోధ్యలో రామాలయాన్ని కోరుకుంటున్నారని, కోర్టుకూడా మెజారిటీ ప్రజల మనోభావాలను గౌరవిస్తుందనేది తన నమ్మకమని నృత్య గోపాల్‌ దాస్‌ అన్నారు. అయోధ్య స్థలమంతా రాముడికి సంబంధించినదేనని ఆయన పేర్కొన్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం