రాష్ట్ర పర్యటనకు పవన్ నిర్ణయం


తెలుగు రాష్ట్రాల్లో యువత నిస్పృహలో ఉందని జనసేన అధినేత, నటుడు పవన్‌ కల్యాణ్‌ వాపోయారు. వారిని జాగృతం చేసేందుకు `చ‌లో రే చ‌లో రే చ‌ల్‌` గీతాన్ని విడుదల చేస్తున్నట్టు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో బుధవారం నుంచి మూడు విడతలుగా పర్యటిస్తానన్నారు. తొలి విడతలో సమస్యల పరిశీలన, అధ్యయనం, చేసుకొని రెండో విడత పర్యటనలో సమస్యల పరిష్కారంపై ప్రభుత్వంతో చర్చలు జరుపుతామన్నారు. అయినా ఫలితం లేకుంటే మూడో విడత పర్యటన పోరాట వేదిక అవుతుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పడవ ప్రమాదంలో 21 మంది చనిపోయారని.. తెదేపాకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేసినందున మీరు కూడా అందుకు బాధ్యులు కాదా?’’ అని ఓ విద్యార్థి వేసిన ప్రశ్న తనను ఆలోచనలో పడవేసిందన్నారు.

ముఖ్యాంశాలు