క్రికెట్ మ్యాచులకు కాలుష్యం పొగ


దేశ రాజధాని దిల్లీ లో కాలుష్యం కారణంగా వచ్చే ఏడాది ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దిల్లీ డేర్‌డెవిల్స్‌ సొంత మైదానంలో ఆడే మ్యాచ్‌లన్నింటినీ తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియానికి మార్చనున్నట్లు వార్తలు వస్తున్నాయి. భారత్‌-శ్రీలంక మధ్య దిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో జరిగిన మూడో టెస్టుకు వాయు కాలుష్యం అవాంతరాలు కలిగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఐపీఎల్‌లో దిల్లీ డేర్‌డెవిల్స్‌ సొంత మైదానం దిల్లీలో మ్యాచ్‌లు నిర్వహిస్తే సమస్యలు తలెత్తవచ్చని బీసీసీఐ ప్రతినిధులు భయపడి ఆ మ్యాచ్‌లన్నిటిని తిరువనంతపురానికి మార్చాలని యోచిస్తున్నారు.

ముఖ్యాంశాలు