కులాంతర వివాహాలకు రూ. 2.5  లక్షల ప్రోత్సాహకం


కులాంతర వివాహాలకు పెద్దపీట వేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుంది. దళితులను వివాహం చేసుకొనే వారికి రూ.2.5 లక్షల చొప్పున ప్రోత్సాహకాలను ప్రకటించింది. దంపతుల వార్షిక ఆదాయం రూ.5లక్షలకు పైబడి ఉండరాదనే నిబంధనను కూడా కేంద్రం తొలగించింది. ఈ పథకం ప్రకారం వధువు, వరుడి వార్షికాదాయంతో సంబంధం లేకుండా ప్రోత్సాహకం ఇవ్వాలని సామాజిక న్యాయం- సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. పథకం కింద దరఖాస్తు చేసుకొనే వధూవరులకు మొత్తాన్ని జమచేయడానికి ఉన్న విధివిధానాలను సవరించి కేంద్రం తీసుకొచ్చిన కొత్త నియమం ప్రకారం కులాంతర వివాహం చేసుకున్న వధూవరుల అభ్యర్థనను అంబేడ్కర్‌ ఫౌండేషన్‌ మొదట పరిశీలించి ఓకే చేయాలి. ఆ తర్వాత వారికి రూ.1.5లక్షలు అందచేస్తారు. మిగతా రూ. లక్షను వారిద్దరి పేరుతో తెరిచిన బ్యాంకు ఉమ్మడి ఖాతాలో జమచేస్తారు. ఆ మొత్తాన్ని మూడేళ్ల తర్వాత వారు తీసుకోవచ్చు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం