దిల్లీ తో సహా పలు చోట్ల భూకంపం


దేశ రాజధాని దిల్లీ తో పాటు గురుగ్రామ్‌ తదితర ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. బుధవారం రాత్రి ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయపడి ఇళ్ళు, కార్యాలయాలనుంచి బయటకు పరుగులు తీశారు. ఉత్తరాఖండ్‌లోని చమోలీ తదితర పర్వతప్రాంతలో కూడా ప్రకంపనలు సంభవించినట్టు వెల్లడైంది. రిక్టర్‌ స్కేల్‌పై ఈ భూకంప తీవ్రత 5గా గుర్తించారు. ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్‌కు 121 కి.మీల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు.

ముఖ్యాంశాలు