సిబల్ వాదనను తప్పుపట్టిన వక్ఫ్ బోర్డు


రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం కేసులో సున్నీ వక్ఫ్ బోర్డు తరఫున సుప్రీంకోర్టులో అనుచిత రాజకీయ వాదనలు వినిపించిన కపిల్ సిబల్‌కు అదే సున్నీ వక్ఫ్ బోర్డు నుంచి చుక్కెదురైంది. 2019 సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ ఈ కేసు విచారణను వాయిదా వేయాలంటూ కోరిన కపిల్ వాదనను సున్నీ వక్ఫ్ బోర్డు తప్పుపట్టింది. సిబల్ వాదన సరైనంది కాదని సున్నీ వక్ఫ్ బోర్డు పేర్కొంది. 'కపిల్ సిబల్ మా న్యాయవాదే... అయితే ఆయన ఓ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి. ఆయన సుప్రీంకోర్టులో ఇచ్చిన స్టేట్‌మెంట్ తప్పు. ఈ సమస్య సాధ్యమైనంత త్వరలో పరిష్కారం కావాలని మేము కోరుకుంటున్నాం' అని సున్నీ వక్ఫ్ బోర్డుకు చెందిన హాజీ మెహ్‌బూబ్ తెలిపారు. వివాదం సాధ్యమైనంత త్వరగా పరిష్కారం కావాలన్నదే తమ అభిమతమని సున్నీ వక్ఫ్ బోర్డు పేర్కొనడాన్ని ప్రధాని మోదీ స్వాగతించారు. ఆయన సున్నీ వక్ఫ్ బోర్డుకు అభినందనలు తెలిపారు. వక్ఫ్ బోర్డ్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందంటూ ప్రశంసించారు. 2019 సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యేంతవరకూ కేసు విచారణను వాయిదా వేయాలంటూ సున్నీ వక్ఫ్ బోర్డు తరఫు న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టులో వాదించిన సంగతి తెలిసిందే.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం