సిబాల్ ది బాధ్యతారాహిత్యం - రవిశంకర్ ప్రసాద్


రామజన్మభూమి వ్యవహారంలో అసలు కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏమిటో దేశానికి చెప్పాలని కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. ఈ అంశానికి సంబంధించిన విచారణ త్వరగా పూర్తికావాలనుకుంటున్నారా? లేదా అని ఆ పార్టీని ప్రశ్నించారు. అయోధ్యలో వివాదాస్పద భూమికి సంబంధించిన విచారణను 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత మాత్రమే చేపట్టాలని సున్నీ వక్ఫ్‌బోర్డు తరఫున కాంగ్రెస్‌ నేత, సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ సుప్రీం ధర్మాసనాన్నికోరిన నేపథ్యంలో రవిశంకర్‌ ప్రసాద్‌ ఘాటుగా స్పందించారు. న్యాయవాదిగా కపిల్‌ సిబల్‌ దేన్నైనా వాదించవచ్చు.. అయితే గతంలో తాను న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన విషయాన్ని ఆయన మర్చిపోరాదు .. అని ప్రసాద్‌ అన్నారు. కపిల్‌ అభ్యర్థన బాధ్యతారహితమని మండిపడ్డారు.